ఆ రైలుకు నమో పేరెలా పెడతారు?..
` మండిపడ్డ కాంగ్రెస్
` జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢల్లీి(జనంసాక్షి): దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్) సెవిూ హైస్పీడ్ రైళ్లకు ‘నమో భారత్’గా నామకరణం చేసినట్టు అధికార వర్గాలు వెల్లడిరచాయి. ఢల్లీి`ఘజియాబాద్` విూరట్ కారిడార్‌లోని 17 కిలోవిూటర్ల సెక్షన్‌ను ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈనెల 21 నుంచి ఇవి ప్రజలకు అందుబాటులోకి రానున్న ట్టు ప్రధాని కార్యాలయం వెల్లడిరచింది. 180 కిలోవిూటర్ల వేగంతో పరుగులు తీసే ఇవి ప్రతి 15 నిమిషాలకు ఒకటి అందుబాటులో ఉంటాయని పీఎంవో తెలిపింది.ఈ వ్యవహారం కాంగ్రెస్ మండిపడిరది. నూతన ప్రవేశపెట్టబోయే సెమీ హైస్పీడ్ రైళ్లకు నమోభారత్‌గా నామకరణం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.కాగా దేశంలోని తొలి ర్యాపిడ్ ట్రైన్‌కి ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఢల్లీి`ఘజియాబాద్`విూరట్ కారిడార్‌లో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఢల్లీి`ఘాజియాబాద్`విూరట్‌ల మధ్య రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్‌ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. నమో భారత్ అని ఈ ట్రైన్ కి నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది 17 కి.విూ.ల మేర సేవలు అందించనుండగా… శనివారం ఇది అందుబాటులోకి వస్తుంది. దీన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ట్రైన్ లో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ట్రైన్ ఇవాళ సహీబాబాద్ నుంచి దుహాయి మధ్య నడిచింది. ప్రధానితోపాటు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ ట్రైన్ లో కనీస టికెట్టు ధర రూ.20 ఉండగా, గరిష్ఠంగా రూ.100 ఉండనుంది. ఢల్లీి, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆర్‌ఆర్టీఎస్ కారిడార్ నిర్మాణానికి ముందడుగు పడిరది. ఢల్లీి ` విూరట్ కారిడర్ 2025వ సంవత్సరంలో పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30 వేల కోట్లు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆర్‌ఆర్టీఎస్ రైళ్లకు ర్యాపిడ్ ఎక్స్ అని పేరు పెట్టింది. ఈ ట్రైన్ గంటకు 180 కి.విూ.ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైళ్లను ’నమో భారత్’గా పిలుస్తామని కేంద్ర మంత్రి మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతంలోనే ప్రకటించారు. ఇది అందుబాటులోకి వస్తే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మరో హై స్పీడ్ ట్రైన్ భారత రైల్వే చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఢల్లీి`ఘజియాబాద్`విూరట్ కారిడార్‌కు ప్రధాని మోదీ మార్చి 8, 2019న శంకుస్థాపన చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెంచడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని అధికారులు చెప్పారు. ఇండియాలో ఇప్పటికే వందే భారత్ రూపంలో ప్రభుత్వం సెవిూ హై స్పీడ్ రైళ్లను నడుపుతోంది.ఈ రైళ్లకు ప్రధాని ’నమో భారత్ అనే పేరు పెట్టారు. షహీదాబాద్ నుంచి దుహాయ్ డిపోట్ వరకూ మొత్తం 80 కిలోవిూటర్ల దూరం ఈ ట్రైన్స్ ప్రయాణించనున్నాయి. 2019 మార్చి 8వ తేదీన ఢల్లీి`ఘజియాబాద్`విూరట్ కారిడార్‌కి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఇప్పుడు ఆయనే ప్రారంభించారు. తొలి టికెట్ కొనుగోలు చేసిన ప్రధాని ట్రైన్‌లో కొంత దూరం ప్రయాణించారు. విద్యార్థులతో పాటు సిబ్బందితో కాసేపు ముచ్చటించారు. ఈ మొత్తం కారిడార్ కోసం కేంద్రం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ రైళ్లలో ఢల్లీి నుంచి విూరట్‌కి గంటలోపే చేరుకునే వెసులుబాటు ఉంటుంది. చూడడానికి మెట్రో రైళ్లలాగే ఉన్నప్పటికీ స్పీడ్‌లో చాలా తేడా ఉంటుంది. గంటకి 160 కిలోవిూటర్ల వేగంతో దూసుకుపోతుంది. కోచ్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లగేజ్ క్యారియర్స్‌తో పాటు మినీ స్కీన్ర్‌లు అమర్చారు. ఢల్లీి నుంచి విూరట్‌కి 82 కిలోవిూటర్ల వేగాన్ని 60 నిముషాల్లోగానే చేరుకోవచ్చని అధికారులు వెల్లడిరచారు. హైస్పీడ్, హై ఫ్రీక్వెన్సీ ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. కనీస టికెట్ ధర రూ.15`20 వరకూ ఉండగా…గరిష్ఠ ధర రూ.160గా నిర్ణయించారు. 2025 జూన్ నాటికి మిగతా రూట్‌లలోనూ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ రైళ్లలోనే ఓవర్‌హెడ్ లగేజ్ ర్యాక్స్ ఏర్పాటు చేశారు. వ్గైª కనెక్టివిటీ కూడా ఉంది. వీటితో పాటు ల్యాప్‌టాప్స్, మొబైల్స్‌కి ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చారు. ఈ ట్రైన్‌లో ప్రత్యేకంగా డిలక్స్ కార్ ఉంటుంది. ఇందులో సీట్‌లు చాలా విశాలంగా ఉంటాయి. లెగ్‌రూమ్ ఎక్కువగా ఇచ్చారు. కోట్ హ్యాంగర్స్ కూడా ఉన్నాయి.