ఆ విమామాన్ని మేమే కూల్చాం
– ఐఎస్‌ఐఎస్
హైదరాబాద్,అక్టోబర్31(జనంసాక్షి): ఈజిప్టు నుంచి రష్యా వెళుతున్న విమానాన్ని తామే కూల్చేశామని ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. టెలిగ్రాం మెసిజింగ్ యాప్‌లో ఉగ్రవాదులు ప్రకటన ద్వారా తెలిపారు. తొలుత ఈజిప్టు భద్రత అధికారులు సాంకేతిక లోపం కారణంగా విమానం కూలిపోయిందని భావించారు. కానీ ఉగ్రవాదులు విమాన ప్రమాద ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రకటన చేయడం గమనార్హం.
ఐఎస్‌కు ఆ శక్తి లేదన్న ఈజిప్టు వర్గాలు
అయితే ఐఎస్ ఉగ్రవాద సంస్థ చేసిన ప్రకటనను ఈజిప్టు వర్గాలు కొట్టిపారేశాయి. ఐఎస్ దగ్గర విమానాన్ని కూల్చివేయగల క్షిపణులు లేవని తెలిపారు. భుజానపైన వుంచి ప్రయోగించే శామ్ క్షిపణుల సామర్థ్యం చాల తక్కువన్నారు. 32 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేయగల సత్తా ఆ క్షిపణులకు లేదన్నారు.