ఇంటర్నెట్‌ను కార్పొరేట్‌ కంపెనీల గప్పెట్లో పెట్టేందుకు కుట్ర

4

-నెట్‌ న్యూట్రాలిటీ చట్టం తీసుకురావాలి

-లోక్‌సభలో రాహుల్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి):

లోక్‌సభలో బుధవారం ఇంటర్నెట్‌ నెట్‌ న్యూట్రాలిటీ దుమారం చెలరేగింది.లోక్‌సభలో నెట్‌ న్యూట్రాలిటీపై జీరో అవర్‌లో వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఇంటర్నెట్‌ను  కార్పొరేట్‌ కంపెనీల గుప్పెట్లో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నెట్‌ న్యూట్రాలిటీపై చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్‌ చేశారు. ఇంటర్నెట్‌ను కార్పొరెట్‌ కంపెనీల చేతిలో పెట్టడం సరికాదన్నారు. దీనిపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ఇరుకున పెట్టింది. రాహుల్‌ వ్యాఖ్యలను కేంద్రమంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, వెంకయ్యనాయుడులు సర్థిచేప్పే కనపయత్నం చేశారు. అంతేగాకుండా నిర్ణయాలు ఓ కమిటీ నిర్ణయాల మేరకు సాగుతాయని,మంత్రిగా తనర వ్యక్తిగత నిర్ణయాలు జరగవని  రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.    ఈ అంశంపై చర్చించాలని రాహుల్‌ ఈ సందర్భంగా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను  కోరారు. దీనిపై టెలికంశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌  సమాధానం ఇస్తూ నెట్‌ న్యూట్రాలిటీకి తాము కట్టుబడి ఉన్నామని, బడా పెట్టుదారులు, కార్పోరేట్లకు కొమ్ము కాస్తున్నారని రాహుల్‌ ఆరోపించగా ,  యూపీఏ సర్కార్‌లాగా తాము కార్పొరేట్లకు ఎప్పుడూ తలవంచలేదని, ఇకముందు తలవంచబోమని అన్నారు. ఉచిత ఇంటర్నెట్‌ సౌకర్యంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అందరికి ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. కాగా పక్షపాతరహితంగా అందరికీ ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండాలన్న ‘నెట్‌ న్యూ ట్రాలిటీ’ అంశంపై వివాదం రేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.  దీన్ని అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఇంటర్నెట్‌ సర్వీసులు అందించే విషయంలో తటస్థంగా ఉండాల్సిన (నెట్‌ న్యూట్రాలిటీ) టెల్కోలు.. ఎంపిక చేసిన కొన్ని యాప్స్‌ను ఉచితంగా అందిస్తుండటం తాజా వివాదానికి దారి తీసింది. ప్రోడక్టు డెవలపర్లు కొంత మొత్తం చెల్లిస్తే వారి యాప్స్‌ను ఇంటర్నెట్‌ యూజర్లు ఉచితంగా వినియోగించుకునే విధంగా కొన్ని టెల్కోలు ప్రత్యేక పథకాలు అందిస్తున్నాయి. దీనివల్ల ఆయా యాప్స్‌, సైట్స్‌కి మరింత ప్రాచుర్యం లభిస్తుంది. అయితే, నెట్‌ విషయంలో తటస్థంగా ఉండాల్సిన (నెట్‌ న్యూట్రాలిటీ) టెల్కోలు ఈ విధంగా చేయడం వల్ల ఇతర సంస్థలు నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  రాహుల్‌ వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందిస్తూ… నెట్‌  సమానత్వంపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ వర్గాల ఒత్తిడికి తలవంచలేదని, స్పెకమ్‌ వేలంలో అధికంగా బిడ్లు రాబట్టిన ఘనత తమదేనన్నారు. అంతర్జాల సమానత్వంపై నిబంధనలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాజకీయ లబ్దికోసమే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రాహుల్‌ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని మల్లిఖార్జున ఖర్గే చేసిన సూచనను స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ తిరస్కరించారు. జీరో అవర్‌లో ఇది సాధ్యం కాదన్నారు.