ఇంటర్మీడియట్ ఫలితాలలో విజయ ఢంకా మోగించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్దకల్ విద్యార్థులు

మల్దకల్ జూన్ 28 (జనంసాక్షి)  ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయడంకా మోగించారు.మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాలలో మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అధ్బుత ప్రతిభ కనబరిచి మంచి ఉత్తీర్ణత శాతంతో కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చారని ప్రిన్సిపల్ ఎం రమేష్ లింగం తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి ఇదే ప్రేరణతో రాబోయే కాలంలో ఇంకా మంచిగా చదివి భవిష్యత్తులో మంచి స్థితిలో స్థిరపడాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్దకల్ లో  రెండవ సంవత్సరం మొత్తం 68 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 61 మంది పాసై 90 శాతం ఉత్తీర్ణత వచ్చినట్లు, మొదటి సంవత్సరం మొత్తం 87 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 50 మంది పాసై 57 శాతంఉత్తీర్ణత కళాశాల సాధించినట్లు వారు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ లో శ్వేత ఎంపీసీ గ్రూప్ లో 470 మార్కులకు గాను 440,అనిత బై పి సి గ్రూప్ లో 440 మార్కులు గాను  426 మార్కులు సాధించింది. విష్ణువర్ధన్ గౌడ్  సి ఈ సి గ్రూప్ లో  500 మార్కులకుగాను 41 3 మార్కులు సాధించాడు. ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలలో నవీన్ ఎంపీసీ గ్రూప్ లో 1000 మార్కులకు గాను 813 మార్కులు, రజిత బై పి సి గ్రూప్ లో 1000 మార్కులు గాను 835 మార్కులు, సతీష్ సీఈసీ గ్రూప్ లో 1000 మార్కులు గాను 816 మార్కులు సాధించాడు.  ఈ సందర్భంగా కళాశాలలో గ్రూప్ ల వారిగా వచ్చిన టాపర్లను కళాశాల ప్రిన్సిపల్ రమేష్ లింగం అధ్యాపకులు అభినందించారు.