ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలదే హవా

4

-రంగారెడ్డి టాప్‌, నల్గొండ లాస్ట్‌

-ఫలితాలు విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి కడియం

హైదరాబాద్‌,ఏప్రిల్‌27(జనంసాక్షి):

తెలంగాణ ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం ఫలితాల్లో కూడా అమ్మాయిలే సత్తా చాటారు.  తెలంగాణలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం ఉదయం ఫలితాలు విడుదల చేశారు. 4 లక్షల 77 వేల మంది విద్యార్థులు పరీక్ష రా యగా… 61.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం ఫలితాల్లో కూ డా అమ్మాయిలేటాప్‌గా  నిలిచా రు. ఫలితాల్లో బాలుర కంటే బా లికలే పై చేయి సాధించినట్లు ఉ ప ముఖ్యమంత్రి వెల్లడించారు. బాలురు 59 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 66.86 శాతం ఉత్తీర్ణతతో

ముందంజలో ఉన్నట్లు తెలిపారు. ఉత్తీర్ణతశాతం గత రెండేళ్ల కంటే పెరిగిందని వివరించారు.  గత సంవత్సరంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది. మే 1 నుంచి విద్యార్థులకు మార్కుల మెమోలు అందజేస్తామని ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. సోమవారం ప్రకటించిన ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షా ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో పరీక్షరాసిన విద్యార్థుల్లో 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.  నల్లగొండ జిల్లాలో అత్యత్పంగా 58 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లోనూ రంగారెడ్డి ఫస్ట్‌ రాగా, నల్లగొండ లాస్ట్‌ వచ్చిన విషయం తెలిసిందే.  మొత్తం 3, 78, 978 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 2, 32,742 మంది పాస్‌ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.4 శాతం నమోదు అయ్యింది.  గత ఏడాదితో పోలిస్తే ఇవి మెరుగైన ఫలితాలని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభం అవుతాయని, ఫీజు గడువును మే 6 గా నిర్ణయించామని అన్నారు. విద్యార్థినీ, విద్యార్థులందరూ ఆ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. కాగా ఫెయిల్‌ అయిన విద్యార్థినీ, విద్యార్థుల కోసం మొదటిసారి ఉచిత కోచింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు.  హైదరాబాద్‌ నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జనరల్‌, వృత్తివిద్య కోర్సుల ఫలితాలను విడుదల చేశారు.  మే 25 నుంచి జూన్‌ 1 వరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ స్లపిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అడ్వాన్స్‌డ్‌ స్లపిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 6 చివరి తేదీగా నిర్ణయించినట్లు కడియం శ్రీహరి వెల్లడించారు. ఈసారి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఉపముఖ్య మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా గ్రావిూణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.  ఎవరైతే విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారో వారికి మూడు వారాల పాటు ప్రత్యేక కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సెంటర్లు ప్రస్తుతానికి జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అయా సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులచే విద్యార్థులకు కోచింగ్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ మూడువారాలు కోచింగ్‌ క్యాంప్‌లో చేరిన విద్యార్థులకు హాస్టల్‌ వసతి సైతం కల్పించనున్నట్లు చెప్పారు. క్యాంప్‌లో పూర్తిగా చదువుకునే వాతావరణం కల్పించి ప్రధాన సబ్జెక్టుల్లో నిపుణులైన అద్యాపకులచే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయనున్నట్లు మంత్రి చెప్పారు. మే 4

నుంచి 21 వరకు ఈ కోచింగ్‌ క్యాంప్‌ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సారి సక్సెస్‌ అయితే వచ్చే సారి మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు కడియం వివరించారు.