ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలు అదరహో!

5

– మెరుగైన ఫలితాలు సాధించిన ప్రభుత్వ కళాశాలలు

– ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం నాడిక్కడ విడుదల చేశారు. ఇంటర్‌ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. . ఫస్టియర్‌ సెకండియర్‌ ఫలితాల్లో బాలికలే అత్యధిక ఫలితాలు పొందారు. ఇంటర్‌ ఫస్టియర్లో 59 శాతం బాలికలు ఫలితాలు సాధించగా.. బాలురు 48శాతమే ఫలితాలు రాబట్టారు. సెకండియర్లో మొత్త ఉత్తీర్ణత శాతం 62.70 ఉండగా.. బాలికలు 67శాతం ఫలితాలు సాధించగా బాలురు 58శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా, రంగారెడ్డి జిల్లా ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాల్లో టాప్‌ స్థానాన్ని సాధించింది.ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 53.32 శాతం మంది, సెకండియర్‌లో 62.01 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 4,56,675 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా… 2,43,503 మంది పాసయ్యారు. వీరిలో బాలికలు 59 శాతం మంది, బాలురు 48 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 4,18,231 మంది పరీక్షలు రాయగా.. 262,245 మంది పాసయ్యారు. వీరిలో బాలికలు 67.64 శాతం మంది, బాలురు 58 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ జనరల్‌, వృత్తివిద్య ఫలితాలు నాంపల్లిలోని ఇంటర్‌ విద్యామండలి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేశారు.  ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో రంగారెడ్డిజిల్లా సత్తా చాటింది. శుక్రవారం విడుదలయిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో రంగారెడ్డి తొలి స్థానంలో నిలిచింది. ఫస్టియర్‌ ఫలితాల్లో 69 శాతం, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో 76 శాతంతో రంగారెడ్డి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఫస్టియర్‌ ఫలితాల్లో హైదరాబాద్‌(56 శాతం) రెండో స్థానంలో నిలవగా, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో ఖమ్మం(66 శాతం) రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు నల్లగొండ 41 శాతంతో  ఇంటర్‌ ఫస్టియర్‌లో చివరిస్థానంలోనూ, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో మెదక్‌, నల్లగొండలు చివరిస్థానంలో నిలిచాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 53.32 శాతం మంది, సెకండియర్‌లో 62.01 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఇంటర్‌ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 4,56,675 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా… 2,43,503 మంది పాసయ్యారు. వీరిలో బాలికలు 59 శాతం మంది, బాలురు 48 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 4,18,231 మంది పరీక్షలు రాయగా.. 262,245 మంది పాసయ్యారు. వీరిలో బాలికలు 67.64 శాతం మంది, బాలురు 58 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో రంగారెడ్డి ప్రథమ స్థానంలో నిలిచింది.

మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్‌ పరీక్షల్లో తప్పిన విద్యార్థుల మే 24 నుంచి మే 31 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు ఫీజు ఏప్రిల్‌ 30 తేదీలోగా చెల్లించాల్సి ఉంటుంది.