ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు

3

-బాలికలదే హవా

-రంగారెడ్డి ఫస్ట్‌

-నల్గొండ లాస్ట్‌

-ఫలితాలు విడుదల చేసిన డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి):

రాష్ట్ర విభజన తరవాత జరిగిన ఇంటర్‌ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రంలో బాలికలే మళ్లీ టాప్‌లో నిలిచారు. అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించి తమకు తిరుగులేదని నిరూపించు కున్నారు.  ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు బుధవారం ఉదయం విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ పరీక్షల్లో 55.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విభజన తరవాత ప్రత్యేకంగా తెలంగాణలో నిర్వహించిన పరీక్షల్లో ఈ ఏడాది కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. మొత్తం 4,31,361 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,39,954 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 61.68 కాగా, బాలురు 49.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ పరీక్షలో రంగారెడ్డి జిల్లా71 శాతంతో  మొదటి స్థానంగా నిలవగా, నల్గొండ జిల్లా 43 శాతం చివరి స్థానంలో నిలిచింది. మే 22లోపు రీ-వెరిఫికేషన్‌ జరుపుకోవచ్చని, ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాలని అధికారులు తెలిపారు. అలాగే మే 25 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫీజు చెల్లింపునకు మే 1 తుది గడువు. ఈనెల 26 నుంచి మార్కుల లిస్ట్‌ అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈసారి ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 71శాతంతో ఉత్తీర్ణతలో మొదటిస్థానం ఆక్రమించగా 43 శాతం ఉత్తీర్ణతతో నల్లగొండ జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షల ఉత్తీర్ణత శాతం 55.62 శాతంగా ఉంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో  పోయిన సంవత్సరం కంటే ఈ సారి ఫలితాలు కొద్దిగా మెరుగున పడ్డాయి. ఈ సంవత్సరం 431363 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 239954 మంది విద్యార్థులు 55.62 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2014 సంవత్సరంలో 415026 మంది పరీక్ష రాయగా, 218549 అనగా 52.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2013 సంవత్సరంలో 437248 మంది పరీక్ష రాయగా, 219679 మంది అనగా 50.24 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష రాసిన విద్యార్థుల్లో మొత్తం 2,39,954 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 61.68 శాతం. బాలురు 49.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. వృత్తివిద్యలో 15,240 మంది ఉత్తీర్ణులైనట్లు ఆయన వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి  ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. జనరల్‌, వొకేషనల్‌ విద్యార్థులు తమ మార్కులను, గ్రేడ్లను వెబ్‌సైట్లలో పొందవచ్చన్నారు.  ఇక ఒకేషనల్లో మొత్తం 53.56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.  కాగా కాగా ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈ నెల 28న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా 71శాతం, హైదరాబాద్‌ 59, వరంగల్‌ 52, ఆదిలాబాద్‌ 53, కరీంనగర్‌ 51, ఖమ్మం 56, మహబూబ్‌నగర్‌ 45, మెదక్‌ 45, నిజామాబాద్‌ 49, నల్గొండ 43శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 56234 మంది బాలురు పరీక్ష రాయగా 37595 మంది అంటే 67 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 47973 మంది పరీక్ష రాయగా 35968 మంది 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లా మొత్తం ఉత్తీర్ణత 71 శాతంగా ఉంది.  హైదరాబాద్‌ జిల్లాలో

34704 మంది బాలురు పరీక్ష రాయగా 17009 మంది అంటే 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 32709 మంది పరీక్ష రాయగా 22504 మంది 69 శాతం ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్‌ జిల్లా మొత్తం ఉత్తీర్ణత 59 శాతంగా ఉంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 9179 మంది బాలురు పరీక్ష రాయగా 4265 మంది అంటే 46 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 10425 మంది పరీక్ష రాయగా 6187 మంది 59 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆదిలాబాద్‌ జిల్లా మొత్తం ఉత్తీర్ణత 53 శాతంగా ఉంది.మెదక్‌ జిల్లాలో 15109మంది బాలురు పరీక్ష రాయగా 5886 మంది అంటే 39 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 14560 మంది పరీక్ష రాయగా 7364 మంది 51 శాతం ఉత్తీర్ణత సాధించారు. మెదక్‌ జిల్లా మొత్తం ఉత్తీర్ణత 45 శాతంగా ఉంది. నిజామాబాద్‌ జిల్లాలో 13431 మంది బాలురు పరీక్ష రాయగా 5639 మంది అంటే 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 14068 మంది పరీక్ష రాయగా 7760 మంది 55 శాతం ఉత్తీర్ణత సాధించారు. నిజామాబాద్‌ జిల్లా మొత్తం ఉత్తీర్ణత 49 శాతంగా ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 17875 మంది బాలురు పరీక్ష రాయగా 7134 మంది అంటే 40 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 16288 మంది పరీక్ష రాయగా 8127 మంది 50 శాతం ఉత్తీర్ణత సాధించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మొత్తం ఉత్తీర్ణత 45 శాతంగా ఉంది. కరీంనగర్‌ జిల్లాలో 18893 మంది బాలురు పరీక్ష రాయగా 7887 మంది అంటే 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 23299 మంది పరీక్ష రాయగా 13793 మంది 59 శాతం ఉత్తీర్ణత సాధించారు. కరీంనగర్‌ జిల్లా మొత్తం ఉత్తీర్ణత 51 శాతంగా ఉంది. ఖమ్మం జిల్లాలో 11159 మంది బాలురు పరీక్ష రాయగా 5530 మంది అంటే 50 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 13511 మంది పరీక్ష రాయగా 8282 మంది 61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఖమ్మం జిల్లా మొత్తం ఉత్తీర్ణత 56 శాతంగా ఉంది. వరంగల్‌ జిల్లాలో 20923 మంది బాలురు పరీక్ష రాయగా 9697 మంది అంటే 46 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 23421 మంది పరీక్ష రాయగా 13345 మంది 57 శాతం ఉత్తీర్ణత సాధించారు. వరంగల్‌ జిల్లా మొత్తం ఉత్తీర్ణత 52 శాతంగా ఉంది. నల్లగొండ జిల్లాలో 18827 మంది బాలురు పరీక్ష రాయగా 6673 మంది అంటే 35 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 18775 మంది పరీక్ష రాయగా 9309 మంది 50 శాతం ఉత్తీర్ణత సాధించారు. నల్లగొండ జిల్లా మొత్తం ఉత్తీర్ణత 43 శాతంగా ఉంది.  జిల్లాల వారీగా వొకేషనల్‌ విద్యార్థుల ఉత్తీర్ణతశాతం వివరాలిలాఉన్నాయి. రంగారెడ్డి 56,నల్గొండ 53,ఆదిలాబాద్‌ 48,మెదక్‌ 48,హైదరాబాద్‌ 47,ఖమ్మం 42,కరీంనగర్‌ 39,మహబూబ్‌నగర్‌ 36,నిజామాబాద్‌ 35,వరంగల్‌ 35 శాతంగా ఉన్నాయి.