ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌ : మాదాపూర్‌ నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సాయికుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని స్వస్థలం ఆదిలాబాద్‌ జిల్లా పాత బెల్లంపల్ల . విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.