ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

మెదక్‌: ఇందోళ్‌ మండలంలోని సంగుపేట గ్రామంలో కొండగారి సాయిలు అనే ఇంటర్‌ విద్యార్థి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు..  పరీక్షకు హాల్‌ టిక్కెట్‌ ఇవ్వలేదని మనస్తాపంతో సాయిలు ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి ఆరోపిస్తున్నారు. జోగిపేటలోని క్రాంతి జూనియర్‌ కళాశాలలో సాయిలు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఫీజు కట్టలేదని యాజమాన్యం హాల్‌టిక్కెట్‌ ఇవ్వలేదు.