ఇంటర్ పరీక్షా ఫలితాలలో వెల్దుర్తి మండల విద్యార్థుల ప్రతిభ

మండల కేంద్రమైన వెల్దుర్తి లోని రాయ రావు సరస్వతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2021 22 సంవత్సరం గాను ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు మొదటి సంవత్సరం 122 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా అందులో 84 మంది ఉత్తీర్ణత సాధించారు ద్వితీయ సంవత్సరం గాను 88 మంది విద్యార్థులకు గాను 85 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో సీఈసీ గ్రూపుకు చెందిన అఖిల కు 436/500, ద్వితీయ సంవత్సరం లో బై పి సి గ్రూప్ కు చెందిన పూజ 936/1000 మార్కులు సాధించారు.ఇందుకుగాను మొదటి సంవత్సరంలో 69% ద్వితీయ సంవత్సరం లో 96 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా ఇబ్బందులను అధిగమించి మా విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించారు కళాశాల అధ్యాపక బృందానికి ఆయన అభినందనలు తెలిపారు.