ఇంటింటికీ ఇంటర్‌నెట్‌తో విప్లవం

– సకాలంలో మిషన్‌ భగీరథ పూర్తిచేస్తాం

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 1,(జనంసాక్షి):అర్భన్‌ మిషన్‌ భగీరథ ప్రాజెక్టుతోపాటు టిఫైబర్‌ ప్రాజెక్టు సమన్వయానికి ఐటి మరియు మున్సిపల్‌ శాఖల జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఎర్పాటు మిషన్‌ భగీరథలో భాగంగా చేపట్టిన టిఫైబర్‌ ప్రాజెక్టు ఫలాలు పట్టణాలకు, నగరాలకు సైతం అందిస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. వాటర్‌ ఫైప్‌ లైన్‌ తోపాటుగా అప్టిక్‌ పైబర్‌ లైన్‌ వేయాల్సిందేనని అదేశాలు జారీ చేశారు. ప్రతి మున్సిపాలీటీ, కార్పోరేషన్లతో పాటు, వాటర్‌ వర్క్స్‌ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న పనుల్లో ప్రతి పైపులైను వేంట ఇంటర్నెట్‌ లైన్లు వేయాలని, ఈ మేరకు అవసరం అయిన అర్ధికపరమైన అంచనాలు సిద్దం చేయాలన్నారు. రాష్టంలో టి ఫైబర్‌ ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వస్తాయని, గ్రామాల్లో నిర్ణీత లక్ష్యం ప్రకారం మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు. ఒకవైపు గ్రామాల్లో మంచినీళ్లతో పాటు ఇంటింటికి ఇంటర్నెట్‌ ఇస్తున్నందున, మిషన్‌ భగీరథ అర్భన్‌ పనులతోపాటు టిఫైబర్‌ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బేగంపేటలో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ శాఖ( పబ్లిక్‌ హెల్త్‌) అధికారులు, వర్కింగ్‌ ఎజెన్సీలతో సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా కార్పోరేషన్లలో నగర పర్యవేక్షణ కోసం సిసి కెమెరాల ఎర్పాటు వంటి కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ మేరకు నగరాలకు ప్రత్యేకంగా నిధులు కూడ ఇచ్చామన్నారు. అర్భన్‌ మిషన్‌ భగీరథ ప్రాజెక్టుతోపాటు టిఫైబర్‌ ప్రాజెక్టు సమన్వయం చేసుకునేందుకు, ఐటి మరియు మున్సిపల్‌ శాఖలు కలిసి పనిచేయాలన్నారు. ఇందుకోసం జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఎర్పాటు చేసుకోవాలన్నారు. గతంలో వేసిన పైపులైన్లను తవ్వాల్సిన అవసరం లేని చోట ప్రత్యేకంగా అప్టిక్‌ ఫైబర్‌ వేయాల్సి ఉంటుందన్నారు. దీంతోపాటు ఫైపులైన్ల నెట్‌ వర్క్‌ తోపాటు, ఇంటర్నెట్‌ కేబుల్‌ నెట్‌ వర్క్‌ డిజిటల్‌ మ్యాపులు సిద్దంగా ఉండేలా ప్రణాళికలు చేయాలన్నారు. ఇప్పటికే రూరల్‌ మిషన్‌ భగీరథలో డక్ట్‌ వేయడం కోసం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని ఏజెన్సీలను కోరారు. పైపులైన్లతోపాటు డక్ట్‌ వేసేందుకు అయిన అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందని, ఈమేరకు లిఖితపూర్వకంగా ఈ ఎన్‌ సి ( పిహెచ్‌ ) అదేశాలు జారీ చేస్తారని మంత్రి తెలిపారు.

మెత్తం అర్భన్‌ మిషన్‌ భగీరథ కోసం మున్సిపల్‌ శాఖ సన్నద్దతపైన మంత్రి సవిూక్ష నిర్వహించారు. మెత్తం ఎన్ని నిర్మాణాలు, ప్రణాళికల రూపకల్పన, నిధుల సవిూకరణ వంటి అంశాలను అధికారులు మంత్రికి వివరాలు అందజేశారు. ప్రతి పట్టణం, నగరం వారీగా చేపట్టాల్సిన పనులను వివరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం టెంటర్లు పూర్తయ్యాని, పలు చోట్ల పనులు సైతం ప్రారంభం అయ్యాయని అధికారులు తెలిపారు. ఈ మెత్తం ప్రాజెక్టును వచ్చే జూన్‌ నాటికి పూర్తిచేయగలిగితే, వచ్చే వేసవికి పట్టణ, నగర ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని మంత్రి తెలిపారు. ఈ మేరకు కాంట్రాక్టు ఎజెన్సీలు పనిచేయాలన్నారు. వారంకోకసారి మిషన్‌ భగీరథ అర్భన్‌ పైన సవిూక్ష నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రితోపాటు మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీల ప్రతినిధులు హజరయ్యారు.