ఇంటింటికీ తాగునీరు ఇవ్వడం చారిత్రాత్మకం

5

– ప్రధాని పర్యటన విజయవంతం చేయండి

– మంత్రి హరీశ్‌ రావు

మెదక్‌,ఆగస్టు 2(జనంసాక్షి): భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7న గజ్వెల్‌ పర్యటన చారిత్రకం కానుందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఇంటింటికీ మంచినీటిని అందించే బృహత్తర పథకం మిషన్‌ భగీరథను ప్రారంభించడం ద్వారా సిఎం కెసిఆర్‌ సంకల్పం నెరవేరబోతోందని అన్నారు. ఇది మెదక్‌ జిల్లా చేసుకున్న అదృష్టమన్నారు. మిషన్‌భగీరథ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని హరీశ్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి మోదీ రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారు.  ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం జగదేవ్‌ పూర్‌ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మోదీకి ఘన స్వాగతం పలకాలని కోరారు. మోడీ 7న ఆదివారం  మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకుంటారని,  పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయన్నారు.  ఏర్పాట్లను మంత్రి హరీశ్‌ రావ్‌ మంగలవారం పరిశీలించారు. కార్యకర్తల సమావేశం అనంతరం విూడియాతో మాట్లాడిన ఆయన.. జిల్లాకు మొదటిసారి ప్రధాని రావడం గర్వకారణమని చెప్పారు. ప్రధాని మోదీ బహిరంగ సభకు సిద్దిపేట నియోజకవర్గం నుంచి 25వేల మందిని తరలిస్తామని ఆయన తెలిపారు. అదే రోజు సిద్దిపేట రైల్వేలైన్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని మంత్రి చెప్పారు.ఇవాళ ఆయన సిద్దిపేటలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశానికి పలువురు టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఆయన జగదేవ్‌ పూర్‌ లో మోదీ పర్యటన కోసం ఏర్పాటు చేస్తోన్న సభాస్థలిని మంత్రి మహేందర్‌ రెడ్డితో కలిసి పరిశీలించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్లు అందించే అద్భుతమైన మిషన్‌ భగీరథ పథకం చరిత్రలో నిలిచిపోవాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని పర్యటనకు ఆ స్థాయిలో ఏర్పాట్లు ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాని ¬దాలో తొలిసారి రాష్ట్రానికి విచ్చేస్తున్న నరేంద్రమోడీ పర్యటన ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దాదాపుగా 2లక్షల మంది హాజరయ్యే విధంగా 60 ఎకరాల విస్తీర్ణం భూమిని చదును చేసి వాటర్‌ఫ్రూఫ్‌ టెంట్లు వేస్తున్నారు. కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌, జేసీ వెంకట్రామ్‌రెడ్డి, గడా ప్రత్యేకాధికారి హనుమంతారావు, ఇతర అధికారులతో కలిసి మంత్రి హరీశ్‌రావు దగ్గరుండి రోజువారీగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రతిష్ఠగా తీసుకున్న మోడీ సభకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలను తరలివచ్చేలా చూస్తున్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో ఈ విషయమై చర్చించారు.  గజ్వేల్‌లో మంత్రి మహేందర్‌రెడ్డి, భగీరథ వైఎస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలతో కలిపి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. గజ్వేల్‌ పేరు చరిత్రలో నిలిచిపోతున్నదని ఈ నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ మంది తరలివచ్చేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రధాని సభకు ఇంకా కేవలం నాలుగు  రోజుల సమయం మాత్రమే ఉండడంతో అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తయ్యేలా మంత్రి హరీశ్‌రావు దగ్గరుండి రోజువారీగా పరిశీలిస్తున్నారు. కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌, జేసీ వెంకట్రామ్‌రెడ్డి, గడ ఓఎస్‌డీ హన్మంతరావుతో పాటు ఇతర శాఖ అధికారులు గజ్వేల్‌లోనే మకాం వేశారు. పెద్దఎత్తున నిర్వహిస్తున్న ప్రధాని సభలో ఏ చిన్న ఆటంకం కూడా కలగకుండా చూడాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశిస్తున్నారు.  దాదాపు 3500మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ వెల్లడించిన విషయం తెలిసిందే. డీజీపీ అనురాగ్‌శర్మ, నిజామాబాద్‌ రేండ్‌ డీఐజీ అనుకున్‌సబర్వాల్‌లు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. 160 ఎకరాలను జోన్లుగా విభజించి వీవీఐపీ, వీఐపీ, ఇతరుల వాహనాల కోసం పార్కింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 4 వేల ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రజలు సభకు తరలిరానున్నారు. ఆర్టీసీ బస్సులను మాత్రమే సభా ప్రాంగణం సవిూపంలోని పార్కింగ్‌ స్థలాల వద్దకు అనుమతించనున్నారు. ప్రైవేట్‌ వాహనాలను మాత్రం 3 కి.విూ. దూరంలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్‌ స్థలం వరకు అనుమతిస్తారు. ప్రధాని ¬దాలో తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న నరేంద్రమోడీ పర్యటనకు గజ్వేల్‌ పట్టణంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.  దాదాపుగా 2లక్షల మంది హాజరయ్యే విధంగా 60ఎకరాల విస్తీర్ణం భూమి చదును చేసి వాటర్‌ఫ్రూఫ్‌ టెంట్లు వేస్తున్నారు.