ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ వి.వెంకటేషులు ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ పై అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ రిక్రూటింగ్ ఆఫీసర్ ఐఏఎఫ్ విగ్ కమాండర్ సజ్జా శ్రీ చైతన్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సేవ చేసే అదృష్టం కొంతమందికి మాత్రమే లభిస్తుందని , అటువంటి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నియామకాలు, అర్హతలు , పరీక్ష విధానం, ఎంపిక, శిక్షణ తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశులు మాట్లాడుతూ విద్యార్థులకు ఆర్మీ , ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల ప్రక్రియపై అవగాహన లేక పోవడంతో ఆసక్తిని కనపరచడం లేదన్నారు.అందుకే ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకట రెడ్డి , ఎన్ సీసీ కోఆర్డినేటర్ వడ్డానం శ్రీనివాస్, అధ్యాపకులు శరత్, అశోక్ , సాయి తదితరులు పాల్గొన్నారు.