ఇండియా ఏ జట్టు బ్యాటింగ్ వైఫల్యం 230 పరుగులకే ఆలౌట్
సెయింట్ టూసియా, జాన్ 17: సెయింట్లూసియాలోని బీసెజూర్ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్ ”ఏ”తో జరుగుతున్న అనధికారిక మూడో టెస్టులో భారత ”ఏ” తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌట్ అయింది. సక్సేనా 61 పూజారా 33 రహానే 32 వనోజ్ తివారి32 రోహిత్ శర్మ 12 ముకుంద్ 10 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో బిషూ, జోనాథన్ కార్టర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండిస్ ”ఏ” జట్లు వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. ఆరంభం నుండే తడబడుతూ బ్యాటింగ్‌ను ప్రారంభించిన భారత్ 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. రాహానే (32) రోహిత్ శర్మ (12) ముకుంద్ (10) అవుటయ్యారు. పెర్మాల్ జాన్సన్ కార్టర్ తలో ఒక వికెట్ పడగొటారు. ఆతరువాత బ్యాటింగ్‌కు దిగినపూజారాని బిషూ రన్ అవుట్ చేయడంతో తొలి రోజు లంచ్ ముగిసేసరికి 116 పరుగులు చేసి 5 వికెట్లను కోల్పోయింది. ఆరవ వికెట్‌కు తివారి వర్దమాన్ సాహా (27) కలిసి 30 పరుగులు జోడించారు. సక్సేనా 59 బంతులో 10 ఫోర్లు కొట్టి 61 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో భారత ”ఏ” తుది జట్టులో మూడు మార్పులు జగిగాయి. ధావన్, దిండా, రాహుల్ శర్మ స్థానంలో జలజ్, సక్సేనా, రాబిన్ బిస్త్, అవానాలకు అవకాశం కల్పించారు. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా వున్నాయి.