ఇంత చేసినా ప్రజలు ఓడించారు : డిఎస్‌, షర్మిలకు పితాని

నిజామాబాద్‌ : జిల్లాకు ఇంతగా అభివృద్ది చేసినా ప్రజలు రెండుసార్లు ఓడించారని శాసనమండలి సభ్యుడు డిం శ్రీనివాస్‌ సోమవారం అవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో, దేశంలో మతసామరస్యానికి ఢోకాలేదన్నారు. జిల్లాకు తాగునీరు, సాగునీరు పథకాలు ఎన్నో తెచ్చామన్నారు. కార్యకర్తలు  పార్టీ ప్రతిష్టను పెంచాలన్నారు. కాంగ్రెసు పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు పాటు పడాలన్నారు.

జిల్లాకు పెద్ద ప్రాజెక్టులు తీసుకువచ్చామని చెప్పారు. నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెసు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో డి. శ్రీనివాస్‌, మాజీమంత్రి సబ్బీర్‌ అలీ, భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌ రెడ్డి పాల్గోన్నారు. అభివృద్ది కేవలం కాంగ్రెసుతోనే సాధ్యమని షబ్బీర్‌ అలీ అన్నారు. దేశంలో అసలైన సెక్యులర్‌ పార్టీ కాంగ్రెసు మాత్రమే అన్నారు. లౌకికవాదం కాంగ్రెసు అభిమతమని సిద్దాంతాలపై నడుస్తున్న పార్టీ అన్నారు.

రైతులు, మైనార్టీల అభివృద్దికి కాంగ్రెసు కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయానికి నీరు ఇచ్చేందుకు కాంగ్రెసు ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేస్తుందని సుదర్శన్‌ రెడ్డి అన్నారు. కరువు ప్రాంతాలకు తాగు నీటిని అందిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని చెప్పారు.

షర్మిలకు పితాని కౌంటర్‌

దివంగత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెసు పార్టీ పోత్తు అని మంత్రి పితాని సత్యనారాయణ పశ్చమ గోదావరి జిల్లాలో అన్నారు. వైయస్‌ చనిపోయినప్పుడు కాంగ్రెసు పార్టీలోనే ఉన్నారని, బతికున్నా పార్టీని వీడేవారు కాదన్నారు. ముఖ్యమంత్రులు మారినా కాంగ్రెసు పథకాలు కోనాసాగుతామని చెప్పారు. పోలవరాన్ని రాజకీయంతో ముడిపెట్టవద్దని కోరారు. కోన్ని పార్టీలు బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నామని విమర్శించారు.