ఇందుర్తిలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 10:
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలని ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మాజీ జెడ్పిటిసి అందె స్వామి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సాయిధ పోరాటములో దొరలకు వ్యతిరేకంగా గ్రామాల్లో ఎదురు తిరిగి వీరనారిలా పోరాడిందని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,రెడ్డి సంఘం అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు గాదె రఘునాథ్ రెడ్డి, రైతు సంఘం నాయకులు కాంతల శ్రీనివాస్ రెడ్డి, రజక సంఘం అధ్యక్షులు పున్నం రాములు,ఉప సర్పంచ్ తోట సతీష్ ,వార్డు సభ్యులు డాక్టర్ శ్రీను,పుల్లయ్య, విష్ణు, జర్నలిస్టులు గుడి కందుల దాసు, సోన్నాయిల భరత్, రజక సంఘం యూత్ అధ్యక్షులు పున్నం సంపత్, రజక సంఘం నాయకులు పున్నం గౌరీ శంకర్, గుడికందుల రాజు,పున్నం శ్రీకాంత్,మనోజ్ తదితరులు పాల్గొన్నారు.