ఇంద్రవెల్లి అమరులకు నివాళి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌20 (జ‌నంసాక్షి):  ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద పలువురు నివాళి అర్పించారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో నివాళి అర్పించడానికి వచ్చే వారు తగ్గారు. కాల్పుల ఘటన జరిగి 20వ తేదీకి  37 ఏళ్లు గడిచాయి. ఇంద్రవెల్లి ఘటనలో అమరులకు నివాళులర్పించేందుకు పోలీసులు షరతులతో అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా  అమరవీరుల స్థూపం పరిసరాల్లో పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. కొందరు గిరిజన నాయకులు, ఆదివాసీలు ఇంద్రవెల్లి మృతులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి స్థూపం వద్ద ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయాలని ఆదివాసీలు డిమాండ్‌ చేశారు.