ఇక తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు
ఇక తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు ,
రాష్ట్రపతి ఎన్నికల్లో మెట్టు దిగొద్దు : నాగం
తేల్చకుండా 2004 నుంచి తెలంగాణ యువకుల ఆత్మహత్యలకు, ఆత్మబలిదానాలకు కారణమైన ప్రణబ్ ముఖర్జీకి వ్యతిరేకంగా ఓటువేయడం ద్వారా ఆయన ఓటమికి తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు కారకులు కావాలన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన శత్రువని, తెలంగాణకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రణబ్‌ను ఓడించాలని నాగం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులందరిపై చర్య తీసుకోవాలని నాగం డిమాండ్ చేశారు. ఆ మంత్రులందరిపైనా విచారణ జరిపించాలన్నారు. జీవోల జారీ వెనుక కీలక పాత్ర పోషించిన అప్పటి ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రారావుపై ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని నాగం సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా కేవీపీని విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తీ ఆపబోదని ఆయన స్పష్టం చేశారు. జూలై నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్, జూన్ 20 (జనం సాక్షి) : త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి వ్యతిరే కంగా ఓటు వేయాలని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాగం జనార్దన ్రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకునే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగిం చుకోవాలన్నారు.