ఇచ్చిన హావిూలను కాంగ్రెస్‌ రాష్టాల్ల్రో అమలు చేయాలి

తెలంగాణ ప్రజలను మోసం చేసే ఎత్తుగడలో కాంగ్రెస్‌
వారి కుట్రలను తిప్పికొట్టాలన్న మంత్రి జగదీశ్‌ రెడ్డి
సూర్యాపేట,సెప్టెంబర్‌22(జనం సాక్షి): కాంగ్రెస్‌వన్నీ ఉత్త హావిూలేనని, ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలిచ్చి మోసం చేయాలని చూస్తున్నరని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. దమ్ముంటే ముందుగా వారి పాలిత రాష్టాల్ల్రో అమలు చేసి చూపించాలని మంత్రి సవాల్‌ విసిరారు. రాష్టాన్న్రి దశాబ్దాల పాటు పాలించి ఏం చేయలేదని, మళ్లీ గెలిచినా చేసేదేం ఉండదని దుయ్యబట్టారు. తాయిలాల పేరిట మభ్య పెట్టాలని చూస్తున్న ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా.. లేదా.. ఇంకా ఏమైనా ప్రభుత్వం తరపున చేయాల్సి ఉందా.. అన్నది గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు.  ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు అన్నీ అబద్ధాలే మాట్లాడారని, ప్రజలను మోసం చేసేందుకు భారీ స్కెచ్‌ వేశారని, ఇందుకు వారిచ్చిన హావిూలే నిదర్శనమన్నారు. తానొక్కటే ప్రశ్నిస్తున్నానని, దేశంలో కాంగ్రెస్‌ పాలిత రాష్టాల్రు నాలుగు ఉన్నాయని, ఇక్కడ ప్రకటించిన హావిూలను ఆయా రాష్టాల్ల్రో అమలు చేసి చూపించాలన్నారు. అప్పుడే వారు చెప్పినవన్నీ నమ్ముతామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల కండ్లకు కనిపించడం లేదన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లేకుంటే, సీఎం కేసీఆర్‌ సీఎం కాకపోతే ఇంతటి అభివృద్ధి సాధ్యపడేదా.. అని ప్రశ్నించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ వచ్చేదా? ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు వచ్చేదా?. రైతు బంద్‌, రైతు భీమా ఇచ్చేవారా..? ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ప్రజల కష్టాలు తెలిసిన ఉద్యమ నేత సీఎం కావడం వల్లే, ప్రజలు అడుగకుండానే వారి అవసరాలకు అనుగుణంగా పథకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ªూష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.20 లక్షలు వెచ్చిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. కోట్లాది నిధులతో సర్కారు దవాఖానలను అభివృద్ధి చేసి, అధునాతన పరికరాలను ఏర్పాటు చేయడం వల్లే ఈ రోజు 90 శాతం జననాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేసి వైద్య విద్యకు ప్రాధాన్యమిచ్చిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు. ఆపదలో ఉన్నవారు ’అన్నా అంటే నేనున్నానంటూ’ అందుబాటులో ఉండి సేవచేసే అవకాశాన్ని సీఎం కేసీఆర్‌ తనకు కల్పించడం పూర్వజన్మ సుకృతం అన్నారు. మనకంటే ముందు పదేండ్లు అధికారంలో ఉన్న
కాంగ్రెస్‌ పాలకులకు ఇవన్నీ కనిపించలేదా..? అని ప్రశ్నించారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్టాన్న్రి అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్‌కు ప్రజలు అండగా ఉండాలని, కాంగ్రెస్‌, బీజేపీలు చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.