ఇటీవల మరణించిన నేతలకు మహానాడు నివాళులు

హైదరాబాద్‌ : గండిపేట ప్రాంగణంలో తెదేపా మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. గత రెండేళ్లలో చనిపోయిన పార్టీ నేతలకు మహానాడు నివాళులు అర్పించింది. తెలంగాణ ఉద్యమంలో అత్మహత్య చేసుకున్న విద్యార్థులు, వడదెబ్బ మృతులకు మహానాడు సంతాపం ప్రకటించింది. అత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకు నేతలు నివాళులు అర్పించారు.