ఇడి చీఫ్‌గా బండి సంజయ్ నియమించారా ?
థాంక్స్ మోడీగారూ అంటూ కెటిఆర్ సెటైర్
హైదరాబాద్,జూలై22(జనం సాక్షి ): సీఎం కేసీఆర్‌కు కూడా ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్‌ని ఈడీ చీఫ్‌గా నియమించిన ప్రధానికి కృతజ్ఞతలంటూ సెటైర్ వేశారు. దేశాన్ని నడుపుతున్న డబుల్ ఇంజిన్ మోదీ, ఈడీ అని దీంతో అర్థమవుతున్నదని ట్వీట్ చేశారు.కేసీఆర్.. నువ్వు చేసిన అవినీతికి నీ విూద కూడా కేసులు పెట్టడం గ్యారంటీ.. రేపు నువ్వు కూడా ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉంటది.. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను రూ.30వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంచారు‘ అంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్లపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానే కాదు.. ఈడీ సారథిగా కూడా నియమించినందుకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
బుల్ ఇంజిన్ సర్కార్ అంటే గుర్తుకొస్తోంది.. నిజానికి ఈ దేశాన్ని నడిపే డబుల్ ఇంజన్ ’మోడీ / ఈడీ’ అని ఇప్పుడే మేము గ్రహించాము.. అని ఎద్దేవా చేశారు. కాగా, రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీ ఎత్తివేత నిర్ణయాన్ని పునఃసవిూక్షించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. రాయితీ ఎత్తివేయాలన్న నిర్ణయం బాధాకరమని అన్నారు. పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యతే కాదు, విధి కూడా అని కేంద్ర మంత్రికి కేటీఆర్ ట్వీట్ చేశారు.