ఇది కక్ష సాధింపు చర్యే `బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌్‌(జనంసాక్షి): హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమన్నారు. కేటీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ఠ అని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రతిపక్ష నేతలను వేధించడమే సీఎం రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారు. స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం చిల్లర డ్రామాలు చేస్తున్నారు. కేటీఆర్‌కు అండగా ఉంటాం అని హరీశ్‌రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అక్రమ కేసులతో కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఎక్స్‌ వేదికగా వెల్లడిరచారు. ’మా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఇది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గం. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ`రేస్‌లో రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది కాంగ్రెస్‌ సర్కార్‌. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నడు రేవంత్‌ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికం.స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. అక్రమ కేసులతో కేటీఆర్‌, బిఆర్‌ఎస్‌ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కేటీఆర్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. రేవంత్‌ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం.’ అని ట్వీట్‌ చేశారు.
కెటిఆర్‌పై రాజకీయ కక్షసాధింపు
బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కక్ష సాధింపు చర్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి తీవ్రంగా ఖండిరచారు. బీఆర్‌ఎస్‌ పార్టీని కట్టడి చేయడానికి బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి కేటీఆర్‌పై కుట్రలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ కార్‌ రేస్‌లో విచారణకు ఏసీబీ అనుమతి ఇస్తూ గవర్నర్‌ అనుమతి తెలపడంతో కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి కేటీఆర్‌పై కుట్రలు చేస్తున్నాయనేది తేటతెల్లామైంది. ఇచ్చిన హావిూలు అమలు చేయలేక ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చినపుడు, ఎన్నికలు వచ్చినపుడు ఇలాంటి కేసుల అంశాన్ని తెరపైకి తెచ్చి రేవంత్‌ రెడ్డి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నాడు అని ప్రశాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రెండేండ్లుగా ఫార్ములా ఈ రేస్‌పై విచారణ పేరుతొ కొండను తవ్వి ఎలుకను పట్టలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కక్షపూరిత రాజకీయాలకు కాంగ్రెస్‌ తెరలేపింది. అందులో భాగంగానే విచారణ పేరిట కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని రేవంత్‌ రెడ్డి చూస్తున్నాడు. ఫార్ములా ఈ కార్‌ రేస్‌తో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని పెంచి తెలంగాణ రాష్టాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిండు కేటీఆర్‌. అక్రమ కేసులతో కేటీఆర్‌, బిఆర్‌ఎస్‌ నాయకులను కట్టడి చేయగలం అనుకోవడం పొరపాటే. విూరెన్ని అక్రమ కేసులు పెట్టిన ప్రజలకు ఇచ్చిన హవిూలు అమలు అయ్యేవరకు, కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే ఉంటాం. కేటీఆర్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి అండగా ఉంటుందని ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. న్యాయస్థానాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది.. విూరు చేసే కుట్రలను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం అని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికాదు అని మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. సమాజంలో ప్రజల అంశాలపై ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నొక్కే ప్రయత్నం చేయడం రాజ్యాంగ విరుద్ధం అని మండిపడ్డారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది కాంగ్రెస్‌ సర్కార్‌ అని విమర్శించారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నడు రేవంత్‌ రెడ్డి అని వినోద్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికం. అక్రమ కేసులతో కేటీఆర్‌, బిఆర్‌ఎస్‌ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. సీఎం రేవంత్‌ రెడ్డి కుట్రలను న్యాయపరంగా ఎదుర్కొంటాం అని వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు.

 

6.ఇప్పటికైనా అరెస్ట్‌ చేయండి
` భాజపా
హైదరాబాద్‌్‌(జనంసాక్షి): భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్‌ అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్‌ ఏం చెబుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో ఏసీబీ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ స్పందించారు. ‘‘భాజపా, భారత రాష్ట్ర సమితి ఒకటే అని విమర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారు? ఇన్నాళ్లూ గవర్నర్‌ అనుమతి ఇవ్వొద్దనే సీఎం కోరుకున్నారు. అవినీతిపరుల ఆస్తులు జప్తు చేస్తానని గతంలో ఆయన అన్నారు. ఇప్పుడు గవర్నర్‌ అనుమతి ఇచ్చారు కదా.. సీఎం ఏం చేస్తారో చూడాలి.’’ అని బండి సంజయ్‌ అన్నారు. అర్బన్‌ నక్సలైట్లు చిన్నపిల్లలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. కార్లలో తిరుగుతూ సొంత పైరవీలు చేసుకుంటూ రూ.కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు.