ఇది మన స్వాతంత్రం?*

యాదగిరి గుట్ట . జనం సాక్షి

దేశవ్యాప్తంగా 75 వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరాపల్లి గ్రామంలో న్యూ డెమోక్రసీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భువనగిరి డివిజన్ కార్యదర్శి బేజాడికుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా నేటికీ దేశంలో, దేశ పరిస్థితిలో పెద్ద మార్పు ఏమి లేదు. నాటి తెల్లవాడి రాజ్యంలో సంస్థాన దీషులంటే నేడు బీజేపీ పాలనలో రాష్ట్రానికి ఒక్క సంస్థాన దీషులు ఉన్నారు. అలాగే టాటా బిర్లా కి మించిన అంబానీ ఆదానీలు ఉన్నారు. నాడు 15 వేల కోట్ల రూపాయల నిధులు మిగులు ఉంటే నేడు 155.33 లక్షల కోట్ల రూపాయల అప్పుల కొంపగా మారింది. జిడిపిలో 60.2% అప్పులే నాడు ఐదు కోట్ల ఆహార నిలువలు ఉంటే నేడు ఆకలి సూచికలో 116 దేశాలలో 101 వ స్థానంలో ఉన్నాం. గతంలో రైతు ఆత్మహత్యలు అనేవి లేవు నేడు అర్ధగంటకు ఒక రైతు అప్పు, ఆకలితో ఆత్మహత్యకు గురవుతున్నట్టుగా నేర రిపోర్టు నివేదిక తెలియజేస్తుంది అని అన్నారు .అంటరానితనన్నీ రూపుమాపలేని స్వాతంత్రం ఎందుకన్నాడు అంబేద్కర్, అధికారిక మార్పు జరిగిన కొద్ది రోజులకే దేశంలోని పరిస్థితులను చూసి ఇది స్వరాజ్యమే కాదు అన్నాడు ఆనాడే గాంధీ . ప్రపంచ సూచికలో అన్ని రంగాలలో 100 ర్యాంకులకు పైగా మన దేశం ఉన్నది .లింగభేదంలో 156 దేశాలలో 140 స్థానం,
సంతోషి సూచికలో 146 దేశాలలో 136వ స్థానం, అవినీతిలో 84వ స్థానం, ఆరోగ్యంలో 158 దేశాలలో 128వ స్థానం, పత్రికా స్వేచ్ఛ సూచికలో 180 దేశాలలో 142వ స్థానం, ప్రజాస్వామ్య సూచికలో 51వ స్థానంలో ఉన్నాం.ఇలా అనేక అంశాలపై బ్రిటిష్ కాలం కంటే నేడు మనం ఎందుకు వెనకబడ్డాం దీనికి ఎవరు కారకులు అని అన్నారు. 1947 కి పూర్వం ఒక బ్రిటిష్ వాడే దోపిడీ చేస్తే నేడు అమెరికా, రష్యా ,జర్మనీ,జపాన్ లాంటి అనేక సామ్రాజ్యకవాద దేశాలు రాబందుల్లాగా దేశాన్ని పీక్కు తింటున్నారు .మన పాలకులు వారికి దళారులుగా మారి దేశాన్ని తాకట్టు పెడుతున్నారు. తాకట్టు నుంచి విడిపించలేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని అమ్మేస్తు రామ రామ అంటున్నారు. దీనిని స్వాతంత్రం అందామా స్వరాజ్యం అందామా అని అన్నారు.ఈ సమావేశంలో ను డెమోక్రసీ సబ్ డివిజన్ నాయకులు కొంగరి సాయిరాం, గ్రామ నాయకులు గడ్డం యాదగిరి ,తదితరులు పాల్గొన్నారు.