ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి
ఖానాపురం : వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లో పురుగుల మందు చల్లుతూ అస్వస్థతకు గురైన ఇద్దరు రైతు కూలీలు మరణీంచారు. గుడీగుంట్ల సాంబయ్య (32) పాయేరి చుక్కయ్య (38) అనే ఇద్దరు రైతు కూలీలు శనివారం పురుగుల మందు పిచికారీ కోసం పోలాలకు వెళ్లారు. అనంతరం అస్వస్థతకు గురికావడంతో వారిని స్థానిక అసుపత్రికి తరలించారు. అసుపత్రిలో చికిత్స పోందుతూ ఈ ఉదయం మృతి చెందారు. పోలిసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు.