ఈతకు వెళ్ళి ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మృతి
ఖమ్మం:జిల్లాలోని బయ్యారంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ఇంజనీర్లు మృత్యువాత పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సరదాగా చెరువులో ఈతకు అని వెళ్లిన ఆ ఇంజనీర్లు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ఇద్దరు హైదరాబాద్ కు చెందిన ఈమేశ్, నాగార్జునులుగా గుర్తించారు.