ఇనుప ఖనిజం పరిరక్షణ యాత్ర ప్రారంభం
హైదరాబాద్ : బయ్యారం ఉక్కు ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. ఇనుప ఖనిజం పరిరక్షణ యాత్రను అయన తెలంగాణ ఐకాస కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ యాత్ర భీమదేవరపల్లి నుంచి బయ్యారం వరకు కొనసాగనుంది.