ఇన్నాళ్లకు గుర్తొచ్చానా…..వానా
కరీంనగర్‌్, జూన్ 5 (జనంసాక్షి) : మండుతున్న ఎండలతో విసిగిపారేసిన జనాలకు మంగళవారం కాస్త ఉపశమనం లబించింది. సాయంత్రం పూట వరణుడు కరుణించి ఒక్కసారి కారుమేఘాలు కమ్ముకొని కొంత సేపు వర్షం కురవడంతో చెప్పలేనంత ఆనందం వ్యక్తమయింది. ఖరీఫ్ సీజన్ ఆరంబంలో ఆరుద్ర కార్తె చివరాంతంకు చేరడం ఇక వానలు కురుస్తాయో లేదో అని ఆకాశం వైపు రోజు చూస్తున్న రైతన్నలకు ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చింది. ఇక వర్షాలు పడతాయనే సూచన ప్రాయంగా వరణుడు నేనున్నాను అన్నట్లుగా వచ్చి దర్శనమిచ్చి వెళ్ళాడు. 40 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు కూడా ఎడతెరిపి లేకుండా ఎండలు తీవ్రమవడంతో జనావాసాలు ఇళ్లకే పరిమితవడంతో ఈ వర్షంతో కేరింతలు కొట్టి మరీ రోడ్లపై తడుస్తూ ఆనందాలు వ్యక్తం చేశారు. మరి వరణుడు కరుణించి ఇటు రైతులకు, జనాలకు ఎంత వరకు న్యాయం చేస్తాడో వేచి చూడాలి మరి.