ఇప్పుడు తెలంగాణ కోసం ఓటేయండి: శశిధర్‌ రెడ్డి

మెదక్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమం చేసినందుకు కేసీఆర్‌కు ఒ కసారి ఓటేశారు.. ఇప్పుడు తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు ఓటేసి ఆ తల్లి రుణ  తీర్చుకుందాం అని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి,మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌ రెడ్డి  ప్రజలను కోరారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని సభ్యత, సంస్కారం లేకుండా టీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. సోనియాగాంధీ అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు  తెలంగాణ ఇస్తే.. కేసీఆర్‌ను దాన్ని తన ప్రతిభగా చాటుకున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దించాలని  పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలంతా పోరాడి తెచ్చుకున్న తెలంగాణను తన ఆస్తిగా కేసీఆర్‌ కుటుంబం అనుభవిస్తోందిన అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ప్రజా సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. ప్రజలు అమాయకులు కాబట్టే 2014 ఎన్నికల్లో కేసీఆర్‌ను నమ్మి ఓట్లు వేస్తే అందిన కాడికి దోచుకున్నారని అన్నారు. కేసీఆర్‌ ఓటును డబ్బుతో కొని అధికారంలోకి రావాలని చూస్తున్నారని, టీఆర్‌ఎస్‌ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకొని కాంగ్రెస్‌ ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. విూ అభిమానం చూస్తే కాంగ్రెస్‌కు అధికారం ఖాయమనిపిస్తుందని, విూ బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్‌ను తెలంగాణలో అధికారంలోకి తేవడం తప్ప మరో మార్గం లేదన్నారు.