ఇర్ఫాని దర్గా 20వ ఉర్సు ఉత్సవాలు

నవంబర్ 14, 15 ఇర్ఫానిదర్గా లో
అఖిలభారత కవి సమ్మేళనము
హకిమ్ ఉమర్బన్ అహ్మద్) ఇరాని దర్గా పీఠాధిపతి
జనం సాక్షి సంగారెడ్డి రూరల్
సంగారెడ్డి శివారులోని శిశుమందిర్ ముందు గల ఇర్ఫాని దర్గా 20వ ఉర్సు ఉత్సవాలు నవంబర్ 14. నుండి ప్రారంభం కానున్నాయి. మౌలాన్ అల్హజ్ హబీబ్ అహ్మద్ బిన్ ఉమర్ ఇర్ఫాన్ అలి షా. గురువారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బంధానవాజి తన 108 సం||రాల జీవిత హయాములో ఎందరికో సన్మార్గాము నీతి, నిజాయితి, మోక్షం, భక్తి, ఆరాధన : భోదించారు. ఎందరికో జీవితాలకు దశాదిశా నిర్దేశించారు. గమ్యం మానవుడు మానవుని జన్మ కర్తవ్యం సమాజం నైతిక విలువలు ఇతరుల పట్ల సత్యప్రవర్తన లేని వారికి నీడ కల్పిండం లాంటి మార్గాల ద్వారా భక్తులు తమ కష్టాలు, కోర్కెలు, మొక్కులు తీర్చుకొనేవారు. ప్రతి సంవత్సరము జరిగే ఉర్సు ఉత్సవాలలో కులమతాలకు అతీతంగా వారి వారి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, నాందేడ్, బీదర్, బస్మత్, పర్బని, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట్ మరియు హైదరాబాద్ ప్రాంతాలలో ఆయన భక్తులు ఉన్నారు. వారు కూడా ఉర్సు ఉత్సవాలలో పాల్గోనడం జరుగుతుంది.
నవంబర్ 14 తేది నాడు స్థానిక జామీయ మజీద్ జిల్లా జైలు దగ్గర నుంచి సాయంత్రం 5- నుండి సంగారెడ్డి ప్రధాన రహదారుల గుండా గంధం ఊరేగింపు. రాత్రి 8-కు ఇర్ఫాని దర్గాలో గంధారాధన కార్యక్రమము జరుగుతుంది. రాత్రి 9-లకు దర్గ ప్రాంగణంలో అఖిల భారత కవి. సమ్మెళనము దీనికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ కవులు జోహర్ కాన్పూరి (ఖాన్పూర్), జియా తోంకి (రాజస్థాన్), హమ్మెద్ బుసవల్లి, హైమ్మద్ అయాజ్ (ఝాన్సి), ముస్తాక్ అహమ్మద్ ముస్తాక్ (మాలెగావ్), మహమ్మద్ సాబెర్ (బస్మత్నగర్), షేక్ అహమ్మద్ జియా (బోధన్), యూసుఫ్ రహీమ్ మీర్ బిద్రి (బీదర్), రజి షుత్తారి (నిజామాబాద్), షకిల్ జహీరాబాద్ (జహీరాబాద్), ఫయాజ్ అలీ సికిందర్ (సదాశివపేట్). సాదుల్లాఖాన్ సబి (జహీరాబాద్) గార్లు పాల్గొంటారు. నవంబర్ 15వ తేది నాడు సాయంత్రం దీపారాధన మరియు మహిఫిలే సమా (ఖవ్వాలి) మరియు అన్నదానము జరుగును. ఈ రెండు రోజుల కార్యక్రమములో వివిధ దర్గాల పీఠాధిపతులు, ప్రజలు, భక్తులు కులమతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో వేల సంఖ్యలో పాల్గోంటారని చెప్పారు. ఇర్బాని దర్గా కమిటి నిర్వాహకులు సజ్జాద నషీన్ (పీఠాధిపతి) హకిమ్ ఉమర్బన్ అహ్మద్ తెలిపారు.
ప్రజలకు, భక్తులకు  పెద్ద సంఖ్యలో పాల్గొని ఉర్సు ఉత్సవాలను విజయ వంతం చేసి ఆశీర్వచనాలు పొందాలని కోరరు హకిమ్ ఉమర్బన్ అహ్మద్) ఇరాని దర్గా పీఠాధిపతి (ఇర్ఫాని ఉర్సు కమిటీ)