ఇలాగైతే ఇస్లాంలో చేరతాం..
కరూర్ (తమిళనాడు),జులై 28(జనంసాక్షి):వివక్షపై దళితులు పోరుబాట పట్టారు. దేవాలయ ఉత్సవంలో పాల్గొనేందుకు తమను అనుమతించకపోవడంతో దళిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు వాపస్ ఇచ్చేస్తామని హెచ్చరించాయి. ఆలయంలోకి ప్రవేశించకుండా తమపై వివక్ష కొనసాగిస్తే.. అందుకు నిరసనగా తాము ఇస్లాం మతంలోకి మారుతామని వారు హెచ్చరించారు.తమిళనాడులోని కరూర్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. దళిత కుటుంబానికి చెందిన గీత మాట్లాడుతూ తమ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని, తమపై ఇలాగే వివక్ష కొనసాగిస్తే.. తాము బలవంతంగా ఇస్లాం మతంలోకి మారే పరిస్థితి రావొచ్చునని చెప్పారు