ఇళ్లు కోల్పోయిన వారికి పక్కా ఇల్లు కట్టివ్వాలి

విజయనగరం,మే30(జ‌నం సాక్షి): విజయనగరం పట్టణంలో హుదూద్‌ తుఫాను బాధితులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని, రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు ఇవ్వకుండా టిడిపి కార్యకర్తలకు ఇస్తున్నారని, ఇది అన్యాయమని అన్నారు. ప్రభుత్వ స్థలంలో వారికి ఇళ్ల పట్టాలివ్వాలని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి రెడ్డి.శంకరరావు డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం వినతిపత్రం అందచేశారు.ఇదిలావుంటే  ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కాపాడుకోవడం కోసం కార్మికవర్గం పోరాటాలు చేయాలని సిఐటియు విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి టివి.రమణ అన్నారు. సిఐటియు 48వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయనగరం తోటపాలెంలో ఉన్న ఎల్బీజీ భవనంలో జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. కార్మికులు హక్కుల సాధనే ధ్యేయంగా పోరాటాలు చేస్తూన్నారన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు ఆపకపోతే మోడీని మార్చేందుకు కంకణం కడతామని హెచ్చరించారు.