ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
జనగామ,జనవరి3(జనంసాక్షి): రాష్ట్రంలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలన్నీ అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని తెరాస ప్రభుత్వం గుర్తించాలని సీపీఎం జిల్లా నాయకుడు జిల్లెల్ల సిద్దారెడ్డి తెలిపారు. ప్రజలకు దిక్కు చూపించే వేగుచుక్క సీపీఎం అంటూ
ప్రజల్ని సంఘటిత పరిచి, సవిూకరించి ఆగడాలను అరికడతామని అన్నారు. తొలిసారిగా టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఒకటి, రెండు గ్రామాల్లో మినహా రాష్ట్రంలో ఎక్కడా ఇళ్ల నిర్మాణం కాలేదని సీపీఎం నాయకుడు పేర్కొంది. వరంగల్ నగరంలో సీఎం శంఖుస్థాపన చేసిన ఇళ్లకు నేటికీ మోక్షం కలగలేదని తెలిపింది. వరంగల్‌లో ఏడాది గడిచినా ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం జరగలేదని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.