ఇళ్ల మధ్యల చేరిన వర్షపు నీటిని మోటార్ ద్వారా తొలగింపు.

గురువారం పట్టణంలోని 30వ వార్డు పరిధిలోని జంగిడిపురం కాలనీలో ఇటీవల కురిసిన వర్షానికి ఇండ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాలలో వరద నీరు, డ్రైనేజీ నీరు చేరి అస్తవ్యస్తంగా మారింది. సమస్యను గుర్తించిన మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ JCB తో తాత్కాలిక కాలువలు ఏర్పాటు చేసి, మోటారుతో మురుగునీరును తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు అయినా కాలనీలు కాబట్టి డ్రైనేజీ వ్యవస్థ, వరద కాలువల సమస్య తీవ్రంగా ఉందన్నారు. పట్టణంలోని పీర్లగుట్ట, టీచర్స్ కాలనీ, రామాలయం వీధి వంటి తదితర ప్రాంతాల నుంచి చిన్నపాటి వర్షం కురిసిన లోతట్టు ప్రాంతమైన జంగిడిపురం కాలనీలోకి వరద నీరు, మురుగునీరు వచ్చి చేరుతుందని అన్నారు. ప్రస్తుతం JCB, మోటార్ల సహాయంతో ఇళ్ల మధ్యలో చేరిన మురుగునీరును తొలగించే పనులు చేపట్టారు. త్వరలోనే సమస్యలను మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టి తీసుకెళ్లి కాలనీలో నూతన వరద కాలువల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. మురుగునీరు పూర్తిగా తొలగించిన అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లించి దోమల వ్యాప్తిని అరికడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగిడి పురం కాలనీ ప్రెసిడెంట్ కురుమయ్య, పరిశుద్ధ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.