ఇవాళ యూపీఏ మిత్రపక్షాలకు ప్రధాని విందు

ఢిల్లీ: విందు భేటీలతో మిత్ర పక్షాలను మచ్చిక చేసుకుని పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను సక్రమంగా నిర్వహించేందుకు, ప్రతిపక్షాల దూకుడుకు కళ్లెం వేసేందుకు యూపీఏ కసరత్తు చేస్తుంది. ఈ మేరకు  యూపీఏ మిత్రపక్షాలకు ఇవాళ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విందు ఇవ్వనున్నారు. అయితే, ఈ విందు భేటీకి డుమ్మా కొట్టే యోచనలో డీఎంకే ఉన్నట్లు సమాచారం. ఎఫ్‌డీఐలపై డీఎంకే నిరసన తెలుపనున్నట్లు  తెలుస్తుంది. ఇప్పటికే ములాయం, అఖిలేష్‌లతో ప్రధాని విందు మంతనాలు నిర్వహించారు. శీతాకాల సమావేశాల్లో తమకు సహరించాలని ఆయన వారితో విజ్ఞప్తి చేశారు. మరోవైపు మాయావతితో కూడా  కాంగ్రెస్‌ పెద్దలు సంప్రతింపులు జరుపుతున్నారు. పార్లమెంట్‌లో బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ వ్యూహం రచిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎఫ్‌డీఐలపై వెనక్కు తగ్గకూడదని యూపీఏ కంకణం కట్టుకుంది. పార్లమెంట్‌లో గట్టివాదలను వినిపించి ప్రతిపక్షాలను సంతృప్తి చేసేందుకు యూపీఏ ప్రభుత్వం సిద్దమవుతుంది.