ఇవాళ ‘సూర్యాపేట సమరభేరీ’
నల్లగొండ : సూర్యపేట గులాబీ కాంతులీనుతుంది, టీఆర్‌ఎస్ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో పట్టణమంతా గులాబీమయమైంది. ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ సమరభేరి మోగనుంది. ఇవాళ సూర్యాపేటలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘ సమరభేరీ’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈసభకు టీఆర్‌ఎస్ అధినేత, గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. సమరభేరి సభకు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులు, లక్షలాది మంది ప్రజలు తరలిరానున్నారు.