ఇష్రత్‌ జహాన్‌ కేసులో మోడీ

ద్వయాన్ని అరెస్ట్‌ చేయాలనుకున్నారు

గుజరాత్‌ మాజీ డీజీపీ డీజీ వంజరా తరపు న్‌ఆయయవాది వెల్లడి

అహ్మాదాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నరేంద్ర మోదీతో పాటు అమిత్‌ షాను అప్పట్లో అరెస్టు చేయాలని సీబీఐ భావించినట్లు ఆ కేసులో గుజరాత్‌ మాజీ డీజీపీ డీజీ వంజరా తరపున వాదించిన న్యాయవాది తెలిపారు. ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ సమయంలో మోదీ.. గుజరాత్‌ సీఎంగా, షా ఆ రాష్ట్ర ¬ంమంత్రిగా ఉన్నారు. 2004 జూన్‌లో ఇష్రత్‌ జహాన్‌తో పాటు అతని మిత్రుల్ని.. అహ్మాదాబాద్‌ పరిసర ప్రాంతాల్లో గుజరాత్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌ కేసులో ప్రస్తుతం వంజరా బెయిల్‌పై ఉన్నారు. అయితే మోదీ, షాలను సీబీఐ అరెస్టు చేయాలని అనుకున్నదని, కానీ అలా జరగలేదని వంజర తరపున వాదించిన న్యాయవాది గజ్జర్‌ తెలిపారు. ఇదే కేసులో అప్పుడు సీఎంగా ఉన్న మోదీని రహస్యంగా కూడా విచారించినట్లు వంజరా గతంలో తన పిటీషన్‌లో పేర్కొన్నారు. సరైన ఆధారాలు లేని కారణంగా.. 2014లో ఇదే కేసులో అమిత్‌ షాకు సీబీఐ క్లీన్‌ చిట్‌ చ్చింది. ఇష్రత్‌ జహాన్‌తో పాటు అతని మిత్రులు అప్పటి సీఎం మోదీని హత్య చేయాలని కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ సీబీఐ విచారణలో ఆ షూటౌట్‌ ఓ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ అని తేలింది.