ఇసుక గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దేవరకొండ మండలం దుబ్బతండాలో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను దుబ్బతండాకు చెందిన సిద్దులు, పవన్ గా గుర్తించారు. పిల్లలిద్దరికీ ఏడేళ్ల వయసు ఉంటుంది. అప్పటిదాకా ఆడుకున్న పిల్లలు ఆస్పత్రిలో విగత జీవులుగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.