ఇసుక తవ్వకాలపై అధికారుల దాడి
మన్నెగూడెం, వరంగల్: వరంగల్ జిల్లా రఘనాథపల్లి మండలం మన్నెగూడెంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇసుక తవ్వకాలపై దాడి చేశారు. ఈ దాడిలో 5 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న అక్రమ రవాణాపై ‘ఈనాడు-ఈటీవీ’ కథనాలు ప్రచురించిన నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు.