సంక్షేమ ఫలాలు ప్రతీ గడపకు చేరాలి
` అదే ప్రజాప్రభుత్వ లక్ష్యం
` రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు
హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి చేరాలనేది తమ సంకల్పమని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఉత్పత్తులు, సేవల రంగంలో తెలంగాణ రాష్ట్రం తిరుగులేని పురోగతి సాధిస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు. తెలంగాణ రైజింగ్? 2047 విజన్ సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలందరూ సంతోషంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ సంబురాలు జరుపుకోవాలన్నారు. పతంగులు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు


