ఇసుక తవ్వకాలు నిలిపిన అధికారులు
సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా తోడుతున్న ఇసుకను రెవెన్యూ అధికారులు శుక్రవారం నిలిపివేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక ఫిల్టర్లు నిర్వహించరాదని అన్నారు. ప్రభుత్వ అనుమతికి విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరిపి సరఫరా చేసే వాహనదారులపైన తీవ్ర చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.