ఇసుక వ్యాన్ పట్టివేత కేసు నమోదు
అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై డి.సుధాకర్
జనంసాక్షి (చిగురుమామిడి) సెప్టెంబర్ 17: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రామాంచ వాగు నుండి శనివారం ఉదయం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో ఎస్సై.డి.సుధాకర్, కానిస్టేబుల్ శ్రీనివాస్, దేవయ్య,లు కలిసి వెళ్లి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న వ్యాన్ ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న వ్యాన్ యజమానీ హుస్నాబాద్ కు చెందిన తిప్పట్ల.రాజు గా గుర్తించి అతని పైన కేసు నమోదు చేసి వాహనంను సీజ్ చేశారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఎంతవారాలైన ఉపేక్షించబోమని ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణా సమాచారం సేకరించిన కానిస్టేబుల్ లను ఎసై సుధాకర్ అభినందించారు.