ఇస్రో ఒప్పందంలో భారత్‌కు ఎదురుదెబ్బ

3

న్యూఢిల్లీ,జులై 26(జనంసాక్షి):  అంతర్జాతీయ ట్రిబ్యునల్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేవాస్‌ కేసులో ట్రిబ్యునల్‌ భారత్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో సుమారు వంద కోట్ల డాలర్ల (రూ.6700 కోట్లు) నష్టపరిహారం దేవాస్‌కు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాణిజ్య విభాగం ఆంట్రిక్స్‌ ఏకపక్షంగా తమ స్పెక్టమ్ర్‌ కాంట్రాక్ట్‌ను రద్దు చేయడంపై దేవాస్‌.. అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. 2005లో అప్పటి ఇస్రో చైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ సమక్షంలో ఆంట్రిక్స్‌, దేవాస్‌ మధ్య ఒప్పందం కుదిరింది. దీనికింద 70 మెగాహెర్‌ట్జ్‌ ఎస్‌ బ్యాండ్‌ స్పెక్టమ్ర్‌ను ఆంట్రిక్స్‌ దేవాస్‌కు అందించాల్సి ఉంటుంది. జీశాట్‌ 6, జీశాట్‌ 6ఎ శాటిలైట్స్‌లోని 90 శాతం ట్రాన్స్‌పాండర్స్‌ను లీజుకు ఇవ్వడం ద్వారా ఈ స్పెక్టమ్ర్‌ను దేవాస్‌కు ఇచ్చేవిధంగా ఒప్పందం కుదిరింది. ప్రతిగా దేవాస్‌ 12 ఏళ్లలో ఆంట్రిక్స్‌కు 30 కోట్ల డాలర్లు చెల్లిస్తామని అంగీకరించింది. అయితే దీనివల్ల నష్టమేనన్న నివేదికలు రావడంతో అప్పటి మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం 2011, ఫిబ్రవరి 17న ఈ

ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసింది. దీంతో దేవాస్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడంపై 2015లోనే ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టు ఆంట్రిక్స్‌కు 4400 కోట్ల జరిమానా విధించింది. 2013, జూన్‌లో ఆర్బిట్రేషన్‌ మొదలైంది. తమకు 160 కోట్ల డాలర్ల నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా దేవాస్‌ కోరింది.