ఇస్రో చైర్మన్ కాకుండా శివన్ నన్ను అడ్డుకున్నారు
` తన ఆటోబయోగ్రఫీలో సోమనాథ్
` చంద్రయాన్2 వైఫల్యానికి కారణాల వెల్లడి
తిరువనంతపురం(జనంసాక్షి): ఇస్రో మాజీ చీఫ్ కే శివన్ తన ప్రగతికి అడ్డువచ్చినట్లు ప్రస్తుతం చైర్మెన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు. ఇస్రో చైర్మెన్ కాకుండా నివారించేందుకు శివన్ ప్రయత్నాలు చేసినట్లు సోమనాథ్ వెల్లడిరచారు. తన ఆటోబయోగ్రఫీ ‘నిలవు కుదిచ సింహంగల్’లో ఈ విషయాన్ని ఆయన రాసుకున్నారు. చంద్రయాన్`2 విఫలం కావడానికి కారణాలను కూడా ఆయన ఆ బుక్‌లో వెల్లడిరచారు. అవసరమైన పరీక్షలు చేపట్టకుండానే తొందరపాటుతో ఆ మిషన్ చేపట్టారని సోమనాథ్ తెలిపారు.2018లో ఇస్రో చైర్మెన్ పదవి నుంచి ఏఎస్ కిరణ్ కుమార్ రిటైర్ అయిన తర్వాత ఆ పోస్టు ఖాళీ అయ్యిందని, దాని కోసం శివన్‌తో పాటు తన పేరును కూడా షార్ట్‌లిస్టు చేసినట్లు సోమనాథ్ తెలిపారు. ఇస్రో చైర్మెన్‌గా శివన్ నియమితుడైనా.. విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా కొనసాగారని, అయితే ఆ పోస్టు తనకు ఇవ్వాలని పోరాడినా.. శివన్ తప్పుకోలేదన్నారు. కానీ ఆరునెలల వ్యవధి తర్వాత ఆ స్పేస్ సెంటర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ బీఎన్ సురేశ్ జోక్యంతో విక్రమ్ సారాబాయ్ డైరెక్టర్‌గా సోమనాథ్ బాధ్యతలు దక్కించుకున్నారు.ఇస్రో చైర్మెన్‌గా మూడేళ్ల పదవీకాలం ముగిసన తర్వాత కూడా శివన్ తన పోస్టు ఎక్స్‌టెన్షన్ కోసం ప్రయత్నించినట్లు సోమనాథ్ ఆరోపించారు. చంద్రయాన్ 2 మూన్ ల్యాండిరగ్ సమయంలో ప్రధాని మోదీని కలవకుండా అడ్డుకున్నారని సోమనాథ్ తన బుక్‌లో తెలిపారు. చంద్రయాన్2 ల్యాండిరగ్ గురించి కూడా శివన్ తప్పుడు సమాచారం ఇచ్చారని, నిజానికి అది సాఫ్ట్‌వేర్ లోపం వల్లే ల్యాండ్ కాలేదని, ల్యాండర్‌తో కాంటాక్టు కాలేదన్న శివన్ వాదన కరెక్టు కాదన్నారు.కిరణ్ కుమార్ చైర్మెన్‌గా ఉన్న సమయంలో చంద్రయాన్2 మిషన్ ప్రారంభమైందని, కానీ శివన్ ఆ ప్రాజెక్టుకు చాలా మార్పులు చేసినట్లు ఆరోపించారు. అతిగా పబ్లిసిటీ ఇవ్వడం వల్ల కూడా చంద్రయాన్2పై ప్రభావం పడిరదన్నారు. చంద్రయాన్3 సక్సెస్ అయిన సమయంలో ప్రధాని మోదీ వచ్చి తనకు ప్రత్యేకంగా అభినందనలు తెలపడం సంతోషంగా అనిపించిందని సోమనాథ్ చెప్పారు. ఇస్రో చైర్మెన్ సోమనాథ్ రాసిన స్వీయచరిత్ర బుక్‌ను లిపి పబ్లికేషన్స్ ప్రింట్ చేసింది.చంద్రయాన్2 విఫలం కావడానికి ఎంక్వైరీ కమిటీ అయిదు కారణాలను చూపిందన్నారు. ఇంజిన్ అసెంబ్లింగ్‌లో లోపాల వల్ల సాఫ్ట్‌వేర్ సమస్యలు వచ్చాయన్నారు. దీంతో ఆల్గోరిథమ్ తప్పుగా మారిందని, దాని వల్ల ఇంజిన్ త్రస్ట్ అనుకున్నదాని కంటే ఎక్కువ వేగాన్ని ప్రదర్శించిందన్నారు. వేగం వల్ల కమాండ్‌కు తగినట్లు శాటిలైట్ స్పందించలేదని, దాని వల్ల అది నిర్దేశిత ప్రదేశంలో దిగలేకపోయిందన్నారు. అయితే ఇలాంటి లోపాలన్నీ గుర్తించడం వల్ల చంద్రయాన్3 సక్సెస్ అయ్యిందన్నారు.