ఇస్లామాబాద్‌ చేరుకున్న రాజ్‌నాథ్‌

1A

ఇస్లామాబాద్‌,ఆగస్టు 3(జనంసాక్షి): పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇస్లామాబాద్‌ చేరుకున్నారు. అక్కడ జరగనున్న సార్క్‌ సమావేశాల్లో పాల్గొనడానికి రాజ్‌నాథ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం ఇస్లామాబాద్‌లో సార్క్‌ దేశాల ¬ంశాఖ మంత్రులు సమావేశమై చర్చలు జరపనున్నారు. దక్షిణాసియా దేశాల్లో ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలపై అర్థవంతమైన సహకారం కోసం ప్రయత్నిస్తానని రాజ్‌నాథ్‌ పర్యటనకు బయలుదేరే ముందు స్పష్టంచేశారు. దేశాల భద్రతకు సంబంధించి చర్చించడానికి ఈ సమావేశాలు మంచి వేదిక అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. భారత్‌లో దాడులకు పాల్పడుతున్న పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే-మొహమ్మద్‌ల గురించి రాజ్‌నాథ్‌ ఈ చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. ఇదిలావుంటే సార్క్‌ ¬ం మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు పాక్‌ వెళ్లిన కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన ఆందోళనలకు నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలావుద్దీన్‌ నేతృత్వం వహించాడు.  రాజ్‌నాథ్‌కు వ్యతిరేకంగా ఇస్లామాబాద్‌ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనల్లో హిజ్బుల్‌ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.