ఈడెన్ గార్డెన్స్‌లో సచిన్: రోహిత్ శర్మ, కోహ్లీలతో సుదీర్ఘ సంభాషణ

కోల్‌కత్తా: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో తళుక్కుమని మెరిశారు. అదీ ముంబై ఇండియన్స్ జెర్సీ వేసుకొని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు బ్యాటింగ్ మెలకువలు నేర్పించారు. ముంబై ఇండియన్స్ జెర్సీలోనే మైదానానికి వచ్చిన సచిన్ టెండూల్కర్, ప్రాక్టీస్ సెషన్ సాగిన రెండు గంటల పాటు అక్కడే ఉన్నాడు. జట్టు సభ్యులందరితో మాట్లాడుతూ మార్గనిర్దేశం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8వ ఎడిషన్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ Vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్‌లో సచిన్: రోహిత్ శర్మ, కోహ్లీలతో సుదీర్ఘ సం ఇందులో భాగంగానే సచిన్ కోల్‌కత్తాపై తొలి మ్యాచ్‌లో జట్టు అనుసరించాల్సిన వ్యూహాల గురించి ముంబై ఇండియన్స్ కోచ్ పాంటింగ్, కెప్టెన్ రోహిత్ శర్మలతో చర్చించాడు. ‘ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఐపీఎల్ మొదలైననాటినుంచి సచిన్ ముంబై జట్టులో భాగమే. ఇకపై కూడా ఉంటాడు. మాకు సచిన్ అవసరం ఎప్పుడు ఉన్నా, సహకరించేందుకు ఆయన సిద్ధంగా ఉంటారు’ అని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఈడెన్ గార్డెన్స్‌లో మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కూడా ప్రాక్టీస్ చేసింది. ఆ సమయంలో బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీతో సచిన్ టెండూల్కర్ సుదీర్ఘంగా మాట్లాడాడు.