ఈదురుగాలికి కూలిన సిఎం సభావేదిక
మెదక్,మే9(జనం సాక్షి): రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత, జిల్లా కేంద్రాల్లో పరిపాలనా భవనాల సముదాయాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయకు ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా యంత్రాంగం కూడా దీని కోసం భారీ ఏర్పాట్లు చేసింది. అయితే ఈదురు గాలులతో కూడిన వర్షం ఈ కార్యక్రమానికి ఓ ఆటంకంగా మారింది. సభా స్థలిలోని టెంట్లు భారీ వర్షానికి కూలిపోయాయి. మరి కాసెపట్లో సీఎం రానున్న నేపధ్యంలో అధికారులు సభా ప్రాంగణాన్ని పునరుద్ధరిస్తున్నారు.