ఈనెల 15 న హైదరాబాదులో జరగబోయే రాజకీయం చైతన్య సభను విజయవంతం చేయండి
-మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు సలికపోగు తిప్పన్న రాజు.
గద్వాల నడిగడ్డ ,మార్చి 11 (జనం సాక్షి);
మాన్యశ్రీ కాన్సిరాం 89 జయంతి సందర్భంగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన బహుజన రాజకీయ చేతన సభ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని మాదిగ జేఏసీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మాన్య శ్రీ కాన్షిరం మార్చి 15, 1934 కవస్ పుర్ గ్రామం లో రుప్ నగర్ జిల్లా పంజాబ్ రాష్ట్రంలో జన్మించాడనీ,భారత రాజకీయంలో బహుజన రాజకీయాలు ఒక స్థానాన్ని కల్పించిన ఘనుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఐతే ఉద్యమాన్ని ఆలోచనలను సిద్ధాంతాలను విజయవంతం చేయడానికి కాన్సిరాం తన వ్యక్తిగత జీవితాన్ని సొంత ఆస్తిని కూడా వదులుకొని సమాజంలో ఆత్యదికంగా ఉన్న 80శాతం మంది బహుజన కులాలను చైతన్యం చేయడానికి కంకణ బద్ధుడై పుణలోని ఆయుధ కర్మగారంలో ఎంతో ఆకర్షణీయమైన ఉన్నంతమైన పరిశోధన అధికారి ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదులుకున్న ఉద్యమ పితామహులైన మహాత్మ జ్యోతిబాపులే సాహుమహారాజ్ పెరియర్ రామస్వామి నాయకర్ నారాయణ ఉద్యమాలను సిద్ధాంతాలను వారు బహుజన జాతికి చేసిన సేవలను పరిచయం చేసే బహుజన కులాలను చైతన్యం చేశారనీ,ఒక్క తుపాకి తుట లాఠీ దెబ్బ లేకుండా అంబేద్కర్ మూవ్ మెంట్ డైనమిక్ మూవ్ మెంట్ మలుపు తిప్పిన కార్యదక్షితుడు మాన్య శ్రీ కాన్షిరం అన్నారనీ, హైదరాబాదులో మాన్యశ్రీ కాన్సిరాం 89వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బహుజనుల రాజకీయ చైతన్య సభను గద్వాల తాలూకా అల్లంపూర్ తాలూకా నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని జిల్లా అధ్యక్షులు తిప్పన్న రాజు ఆన్నారు.