ఈనెల 19న జరిగే ఏఐటీయూసీ జిల్లా రెండో మహాసభలను విజయవంతం చెయ్యండి

హుజూర్ నగర్ నవంబర్ 15 (జనం సాక్షి): ఈనెల 19న జరిగే ఏఐటీయూసీ జిల్లా రెండో మహాసభలు నడిగూడెంలో జరుగుతున్నందున అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని సీపీఐ ఆఫీస్ నందు ఏఐటీయూసీ మండల కౌన్సిల్ సమావేశం ఇందిరాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడశ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, 102 సంవత్సరాలు చరిత్ర కలిగిన మొట్టమొదటి సంఘం ఏఐటీయూసీ అని నిరంతరం కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తు కార్మికులకు అండగా ఏఐటీయూసీ జెండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ప్రసాద్, దగ్గుబాటి సత్యానందం, గోపి, బాబా, బండి భాస్కర్, రామ్మూర్తి, టీ జయరాజు, ములకలపల్లి నర్సింహారావు, కృష్ణ, వై బాలాజీ, గాంధీ, వెంకటేశ్వర్లు, ఆశీర్వాదం, కడరి బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.