ఈనెల 19న మెగా ఉద్యోగ మేళ

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 19న ఉద్యోగ మేళ లో బాగంగా
హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ నిర్వహిస్తున్న టెక్ బి ప్రోగ్రాం కొరకు అర్హులైన అభ్యర్థుల ఎంపికకు   (సాఫ్ట్వేర్ రంగం) మెగా ఉద్యోగమేల నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ బుధవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
2021-22 లో ఎంపీసీ లేదా ఎంఈసి లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు అర్హులన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ,  ప్రభుత్వ రంగ, ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ/ఎం ఈ సి లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు, మ్యాథమెటిక్స్ లో 60 శాతం మార్కులు పొందిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.
అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు,ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతులు,  ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆండ్రాయిడ్ మొబైల్ తో రావాలని సూచించారు.
జాబ్ మేళా ఈ నెల 19న ఉదయం 9 గంటలకు పటాన్చెరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు నేరుగా సూచించిన సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు.
మరిన్ని వివరాలకు హెచ్సీఎల్ ప్రతినిధి సెల్ ఫోన్ నంబర్ 9014600354/7674007616/
9010926721 లలో సంప్రదించాలని సూచించారు