ఈనెల 23న దివ్యాంగులకు క్రీడా పోటీలు
డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సంక్షేమ మహిళ శిశు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 23 న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్పి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ 23 తేదీన 9 గంటల 30 నిమిషాలకు దివ్యాంగులు జూనియర్స్(10_16 ఏండ్లు). సీనియర్స్.(17_54. ఏండ్లు.) విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోటీల్లో పాల్గొని దివ్యాంగులు పుట్టిన తేదీ నిర్ధారణ ధ్రువీకరణ కోసం ఏదేని ఒక ఐడి కార్డు ఆధార్ సదరం స్టడీ సర్టిఫికెట్ తీసుకొని రావాలని సూచించారు పరుగు పందెం పోటీల్లో పాల్గొనేవారు ఎవరి ట్రై సైకిల్ వారే తెచ్చుకోవాలన్నారు జిల్లాలోని శారీరక ఆంధ మధిర మానసిక దివ్యాంగులు దివ్యాంగ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు 40 శాతం దాటిన అన్ని రకాల వైకల్యం కలిగిన స్త్రీ పురుష దివ్యాంగులకు నాగర్ కర్నూల్ లో ఆర్టీసీ ఉచిత బస్సు పాస్ ను ఒక ఏడాది కాలానికి అందజేస్తారన్నారు 40 శాతం వికలత్వం దాటిన వారు ఒక ఫోటో సదరన్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఈనెల 23న జెడ్పి మైదానంలో డీ డబ్ల్యూ ఓను కలవాలని సూచించారు